
ప్రభుత్వ పాఠశాలలో ఐఐటీ పాఠాలు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, ఇల్లంతకుంట, రేపాక, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా మద్రాస్ ఐఐటీతో భాగస్వామ్యం అయ్యాయని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు పావని, ప్రేమలత, రేవతీదేవి శుక్రవారం తెలిపారు. ఈమేరకు మద్రాస్ ఐఐటీ ఈమెయిల్ ద్వారా తమకు సమాచారం అందినట్లు తెలిపారు. పాఠశాల, ఉన్నతవిద్య మధ్య అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా ఐఐటీ మద్రాస్ సెంటర్ ఫర్ అవుట్ రీచ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్(కోడ్) ద్వారా స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తమ పాఠశాలలోని విద్యార్థులకు ఆన్‌లైన్‌లో మద్రాస్ ఐఐటీ ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ వంటి పది రకాల కోర్సులు 8 వారాల వ్యవధితో నామమాత్రపు రుసుంతో అందించనున్నట్లు వివరించారు. 10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఆగస్టు నుంచి రెండు నెలలపాటు ఈ కోర్స్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇల్లంతకుంటలో మూడు హైస్కూళ్లు ఎంపిక