
మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి
కరీంనగర్: మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించా లని, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. జిల్లా కేంద్రంలో ని కోతిరాంపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో మహిళా భివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవా రం సభ నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ‘ఆరోగ్య మహిళ’ ఉచిత వైద్య పరీక్షలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరు నెలలకోసారి చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్య మహిళ పరీక్షల ద్వారా ఏడాదిలో 13 మంది మహిళలకు క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించినట్లు తెలిపారు. చదువు మధ్యలో ఆపేసిన స్వయం సహాయక సంఘాల సభ్యులు ఓపెన్ స్కూల్‌లో చేరి పదో తరగతి, ఇంటర్ పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఏడాదిగా నిర్వహిస్తున్న శుక్రవారం సభ ద్వారా అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుతున్నామని తెలిపారు. జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, మెప్మా పీడీ వేణుమాధవ్, సీడీపీవో సబిత పాల్గొన్నారు.