స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయం | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయం

Jul 11 2025 6:09 AM | Updated on Jul 11 2025 6:09 AM

స్థాన

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయం

● కరీంనగర్‌ ఎమ్మెల్యే కమలాకర్‌

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌లోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్‌, రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావుతో కలిసి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలెప్పుడొచ్చినా బీఆర్‌ఎస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. కన్నెపల్లి నుంచి నీరు లిప్ట్‌ చేసి మధ్యమానేరు, ఎల్‌ఎండీ, వరదకాలువల్లో నింపాలన్నారు. జిల్లా సమస్యలపై ప్రభుత్వానికి, సంబంధిత మంత్రులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై పక్షపాత ధోరణితో ఉన్నారని, కరీంనగర్‌లో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయలేదన్నారు. పోలీసులు బీఆర్‌ఎస్‌ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలని హెచ్చరించారు. రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తన ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. బండ ప్రకాశ్‌, నగర బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చల్లా హరిశంకర్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి, పొన్నం అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

హవ్వా.. ఇదేం చోద్యం!

ఫోర్‌లైన్‌ మంజూరైనా మొక్కలు నాటిస్తున్న అధికారులు

చిగురుమామిడి: తొలగిస్తారని తెలిసినా.. మొక్కలు నాటేందుకు గుంతలు తీస్తున్నారు సంబంధిత అధికారులు. హుస్నాబాద్‌ నుంచి చిగురుమామిడి మండలంలోని కొండాపూర్‌, సుందరగిరి, చిగురుమామిడి, సీతారాంపూర్‌, చిన్నముల్కనూర్‌ ద్వారా తిమ్మాపూర్‌ మండలం కొత్తపల్లి వరకు ఫోర్‌లైన్‌ మంజూరైంది. మొదటి విడతగా రూ.80కోట్లు మంజూరు చేశారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నా యి. ఈ విషయం తెలిసినా చిగురుమామిడిలో ప్రధాన రహదారికి ఇరువైపులా వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు ఈజీఎ స్‌ కూలీలు గుంతలు తీస్తున్నారు. వారంరోజులుగా గుంతలు తీస్తుండగా ఇదెక్కడి చోద్యమ ని మండల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా రు. రోడ్డు పనులు ప్రారంభం అయితే నాటిన మొక్కలు తొలగించరా అని ప్రశ్నిస్తున్నారు.

మెడికల్‌ కౌన్సిల్‌ దాడులు ఆపాలి

కరీంనగర్‌టౌన్‌: తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చేస్తున్న దాడులతో ఆగమైపోతున్నామని ఆర్‌ఎంపీ, పీఎంపీల సంఘం బాధ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో గురువారం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక చికిత్స చేస్తున్న ఆర్‌ఎంపీలను దొంగలు, నకిలీ వైద్యులని భయభ్రాంతులకు గురిచేస్తూ కేసులు పెడతామని బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమకు ప్రాథమిక చికిత్స అందించేందుకు వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆర్‌ఎంపీ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా అద్యక్షుడు డి.మనోహర్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, శ్రీనివాసమూర్తి, రాజేశ్వర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రవీందర్‌ పాల్గొన్నారు.

12న ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌

కరీంనగర్‌: రాష్ట్ర వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో సివిల్స్‌కు హైదరాబాద్‌లో 9 నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ రవి కుమార్‌ పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాకు చెందిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఈనెల 12న ఉదయం 12 గంటల నుంచి 2గంటల వరకు నిర్వహించబడునని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు వాగేశ్వరి ఇంజినీరింగ్‌ కళాశాలలో హాల్‌ టికెట్‌, ఏదైనా గుర్తింపు కార్డుతో హాజరుకాగలరని పేర్కొన్నారు. వివరాలకు 0878– 2268686, కరీంనగర్‌లోని సీబీ స్టడీసర్కిల్‌ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయం
1
1/2

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయం
2
2/2

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement