
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
● డీఎంహెచ్‌వో వెంకటరమణ
కరీంనగర్‌టౌన్: సాధారణ ప్రసవాల కోసం గర్భిణులను ప్రోత్సహించాల ని డీఎంహెచ్‌వో వెంకటరమణ సూచించారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో గురువారం ఆశా ఫెసిలిటేటర్స్, మహిళా సూపర్‌వైజర్లతో సమీక్ష నిర్వహించారు. సిజేరియన్‌తో ఉత్పన్నమయ్యే అనారోగ్య సమస్యలను తెలియజేయాలన్నారు. ప్రపంచ జనా భా దినోత్సవం సందర్భంగా జూలై 14, 17తేదీల్లో కరీంనగర్, హుజూ రాబాద్, జమ్మికుంట ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరాలకు అర్హత కలిగిన దంపతులను తరలించాలన్నారు. డాక్టర్లు ఉమాశ్రీ, సన జవేరియా, విమల, స్వామి, రామనాథం, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.