
భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి
కరీంనగర్‌కల్చరల్: వ్యాస, గురుపౌర్ణమి సందర్భంగా గురువారం పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పలువురు తమ గురువులను ఘనంగా సత్కరించారు. నగరంలోని సాయిబాబా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. సాయినగర్ విజయగణపతి సాయిబాబా ఆలయంలో మంగళాస్నానాభిషేకాలు, పుష్పార్చనలు, విశేషాలంకరణాలు నిర్వహించారు. ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి 24 గంటల అఖండనామం కీర్తనలు ఆరంభించారు. డాక్టర్ ప్రదీప్ కుమార్, కాంచన ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ నాయిని సుప్రియ, ఆలయ చైర్మన్ చిట్టుమల్ల కొండయ్య, ధర్మకర్తలు అయిందాల లక్ష్మయ్య, ఈవో ఎండపల్లి మారుతి పాల్గొన్నారు.