
శేఖర్‌రావుకు డాక్టరేట్ పురస్కారం
కరీంనగర్: 30 సంవత్సరాలుగా విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడుతూ సమస్యల పరిష్కారానికి, సంఘ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తిగా, కరోనా కాలం నుంచి వారు చేస్తున్న సేవలను గుర్తించి హోప్ థియోలాజికల్ యూనివర్సిటీ వారు ప్రముఖ విద్యావేత్త, ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రజ్ఞా వికాస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావుకు గురువారం డాక్టరేట్ పురస్కారం అందజేశారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పాఠశాలలో పని చేసే బోధన, బోధనేతర సిబ్బందికి కరోనా సమయంలో యాజమాన్యాల సహకారంతో ఎంతోకాలం నిత్యావసర సరుకులు అందించి ఆదుకున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వడంలో కూడా సఫలీకృతులయ్యారు.
ఉద్యోగం రావడం లేదని యువకుడి ఆత్మహత్య
గంభీరావుపేట(సిరిసిల్ల): ఉద్యోగం రావడం లేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నర్మాలలో గురువారం జరిగింది. నర్మాలకు చెందిన లోకం శ్రీకాంత్(25) హైదరాబాద్‌లో ఉద్యోగాల కోసం వెతుకుతున్నాడు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చి గ్రామ శివారులోని వరి పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తల్లి మణెమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.

శేఖర్‌రావుకు డాక్టరేట్ పురస్కారం