
పిచ్చికుక్కల దాడిలో 12 మందికి గాయాలు
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండల కేంద్రంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చందుర్తిలో గురువారం 12 మందిపై దాడి చేయగా ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. చందుర్తికి చెందిన పోతురాజు తిరుపతి, పోంశెట్టి లక్ష్మి, జైనభీ, భారతి, మర్రి మల్లయ్య, ఎన్నం రవి, వై.రామయ్య, ఆశిరెడ్డిపల్లికి చెందిన భసూరి బ్రహ్మచారి, మల్యాలకు చెందిన ఎన్.శేషాద్రి, రామన్నపేటకు చెందిన లక్ష్మీరాజం, లింగంపేటకు చెంందిన తిరుమల మోహినయ్య, కమటం హిమబిందులపై దాడిచేశాయి. జైనభీ, లక్ష్మీరాజం, పోంశెట్టి లక్ష్మి, పోతురాజు తిరుపతి, భసూరి బ్రహ్మచారిలకు తీవ్ర గాయాలు కావడంతో వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చందుర్తి పీహెచ్‌సీ వైద్యాధికారి సురేష్‌కుమార్ తెలిపారు.

పిచ్చికుక్కల దాడిలో 12 మందికి గాయాలు