
భయపెటిన్రు
ఉపగ్రహం పడుతోందని చెప్పినప్పుడు నాకు ప్రెగ్నెన్సీ ఉంది. అప్పుడు రేడియో వార్తలు వినేటోళ్లం. అందరూ కోళ్లు, గొర్రెలు కోసుకొని తినుకుంటనే.. చనిపోతమని భయపడేటోళ్లు. జూలై 11న ఉపగ్రహం గండం గడిచిందని వార్త వచ్చిన రోజు నాకు కొడుకు పుట్టిండు. కొడుకు పుట్టిండు, అందరిని బతికించిండు అని అందరూ సంబర పడ్డరు.
– కందుల చంద్రమ్మ, మంగళపల్లి
పేరులో ప్రత్యేకత ఉంది
స్కైలాబ్ ఉపగ్రహం సముద్రంలో పడిపోయి గండం గడిచిపోయిన రోజు నేను పుట్టానట. దాంతో మా అమ్మానాన్న, మేనమామలు నా పేరు స్కైలాబ్ అని పెట్టడంతో, ఊహ తెలిశాక పేరులో ప్రత్యేకత ఉందని అర్థమైంది. నా పేరు వినగానే అప్పటి తరానికి ఆ పేరు ఎందుకు పెట్టారో అర్థం అవుతుంది.
– స్కైలాబ్ గౌడ్, చొప్పదండి

భయపెటిన్రు