
గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్టు
జమ్మికుంట: జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. చివరకు పోలీసులకు చిక్కడంతో నలుగురు యువకులు కటకటాలపాలయ్యారు. బుధవారం జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మాధవి వివరాలు వెల్లడించారు. కమలాపూర్ మండలం బీంపల్లి చెందిన మహమ్మద్ అప్రీద్, వేములవాడ మండలం శాత్రాజుపల్లికి చెందిన పాశం తరుణ్, గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన జంగం శశిప్రీతం, కరీంనగర్ పట్టణంలోని కిసాన్‌నగర్‌కు చెందిన బండి పూర్ణచందర్‌కుమార్ నలుగురు జులాయిగా తిరుగుతూ ఈజీగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఏపీలోని సీలేరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేశారు. జమ్మికుంట శివారులోని ఎఫ్‌సీఐ సమీపంలో చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయాలు జరిపేందుకు వెళ్తుండగా మంగళవారం పోలీసులకు పట్టుబడ్డారు. వారినుంచి 15 కిలోల గంజాయి (రూ.3లక్షల75వేలు) రెండు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. గతంలో అప్రీద్, శశిప్రీతం, పూర్ణచందర్ కుమార్‌పై కరీంనగర్‌లోని పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఎవరైనా గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో టౌన్ సీఐ రామకృష్ట, ఎస్సై సతీశ్, హెడ్ కానిస్టేబుల్ ఎండీ యాకూబ్, కానిస్టేబుళ్లు, అబ్దుల్ ఖదీర్, రాజేందర్ ఉన్నారు.
15 కిలోల గంజాయి , రెండు బైక్‌లు,
నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం