
కథలాపూర్‌లో ఒకరిపై హత్యాయత్నం
కథలాపూర్: మండలకేంద్రంలో ఓ వ్యవసాయ భూమికి వెళ్లే దారి విషయంలో ఆదివారం వివాదం చోటుచేసుకుని హత్యాయత్నానికి దారితీసింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన తిక్క మల్లేశ్, తిక్క రాహుల్ మధ్య కొంతకాలంగా దారి విషయంలో వివాదం నడుస్తోంది. ఆదివారం ఉదయం మల్లేశ్ పొలం వద్దకు వెళ్లగా.. అక్కడే రాహుల్, కోరుట్లకు చెందిన ఆదిత్య ఉన్నారు. దారి విషయంలో మరోసారి వివాదం జరిగింది. దీంతో మల్లేశ్‌పై రాహుల్, ఆదిత్య కలిసి కట్టెలతో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు మల్లేశ్‌ను చికిత్స నిమిత్తం కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాహుల్, ఆదిత్యపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు.