
జై జగన్నాథ
ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025
భజనలు, కోలాటాలు, నృత్యాలు, భక్తి పారవశ్యం నడుమ సుభద్రా బలభద్ర సమేత జగన్నాథ రథయాత్ర నగర పురవీధుల్లో శనివారం వైభవంగా సాగింది. జగన్నాథ రథయాత్ర కమిటీ ఆధ్వర్యంలో రాంనగర్‌లోని రమాసత్యనారాయణస్వామి ఆలయం వద్ద కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలంపూజలు చేసి రథయాత్రను ప్రారంభించారు. వందలాది మంది రథాన్ని లాగగా.. యాత్ర రాంనగర్, మంకమ్మతోట, తెలంగాణచౌక్, బస్టాండ్, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, కమాన్, శాస్త్రిరోడ్, టవర్, రాజీవ్‌చౌక్ మీదుగా వైశ్యభవన్‌కు చేరుకుంది. ఇస్కాన్ నరహరి ప్రభుదాస్, యాత్ర కమిటీ సభ్యులు కన్నకృష్ట, తుమ్మల రమేశ్‌రెడ్డి, ఎల్.భాస్కర్‌రెడ్డి, బుర్ర మధుసూన్‌రెడ్డి, కొమురవెల్లి వెంకటేశం, రాళ్లబండి గోపాల్‌రెడ్డి, జానార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. – కరీంనగర్ కల్చరల్
న్యూస్‌రీల్

జై జగన్నాథ

జై జగన్నాథ