
శ్రీచైతన్య ఫార్మసీ విద్యార్థులకు జాతీయ ర్యాంకులు
తిమ్మాపూర్: ఎల్‌ఎండీ కాలనీలోని శ్రీచైతన్య ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ నాలుగో సంవత్సరం విద్యార్థులు జాతీయస్థాయి పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని చైర్మన్ ముద్దసాని రమేశ్‌రెడ్డి తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాలలో మంగళవారం అభినందించారు. జీప్యాట్‌లో డి.సౌమ్య మొదటి ర్యాంకు, భూక్యా సౌడన్న రెండోర్యాంకు సాధించగా, నీఫర్ ప్రవేశ పరీక్షలో డి.సౌమ్య, వి.సుచిత్ర, వి.శివకష్ణ ఉత్తీర్ణులయ్యారు. టీఎస్‌పీజీఈసీఈటీలో సుచిత్ర 42వ ర్యాంకు, కె.ప్రభాస్ 125వ ర్యాంకు, ఎస్.గౌతమి 160వ ర్యాంకు, వి.వర్షిత్ 168వ ర్యాంకుతో సహా మొత్తం 49 మంది రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి తమ కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రామనరసింహరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్.అప్పారావు, హెచ్‌వోడీలు ఎం.రవీందర్, జి.చంద్రకళ, కె.రామ్‌ప్రసాద్ పాల్గొన్నారు.