ఫస్ట్‌ వికెట్‌ డౌన్‌! | - | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ వికెట్‌ డౌన్‌!

Jul 1 2025 4:03 AM | Updated on Jul 1 2025 4:03 AM

ఫస్ట్

ఫస్ట్‌ వికెట్‌ డౌన్‌!

కార్పొరేషన్‌ కహానీ–1

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

గరంలోని కిసాన్‌నగర్‌ సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి సంబంధించిన అక్రమాల వ్యవహారంలో తొలి వేటు పడింది. లేని రాళ్లను కట్‌ చేశామని రూ.80లక్షలు బిల్లు చేసినట్లుగా చెబుతున్న ఎంబీ 152 మాయమైన ఘటనలో ఏఈ అబ్దుల్‌ గఫూర్‌ను సస్పెండ్‌ చేస్తూ నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ ఆదేశాలు జారీచేశారు.

కిసాన్‌నగర్‌ మార్కెట్‌ నిర్మాణానికి సంబంధించిన ఎంబీ 152ను వారం రోజుల్లో తీసుకురావాలని, లేదంటే సస్పెండ్‌ చేస్తానంటూ ఇటీవల హెచ్చరించినట్లుగానే కమిషనర్‌ నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే ఈక్రమంలో కమిషనర్‌ చర్యలు తీసుకోవడం. ఈ విషయంలో ఏడాది పాటుగా పోరాడుతున్న ‘సాక్షి’ పోరాటం ఫలించింది. కానీ... అదే సమయంలో అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సస్పెన్షన్‌ తరువాత విచారణ కొనసాగుతోందని కమిషనర్‌ పేర్కొనడంతో మరింత మందిపై చర్యలు ఉంటాయన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

ఎంబీ మాయం..

నగరంలోని కిసాన్‌నగర్‌ వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో దాదాపు రెండు సంవత్సరాల క్రితం రూ.5.80 కోట్లతో సమీకృత మార్కెట్‌ నిర్మాణాన్ని చేపట్టారు. అధికారులు, కాంట్రాక్టర్‌ కుమ్మకై ్క అంచనాలు పెంచారంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. లేని గుట్టను చూపించి, రాక్‌ కటింగ్‌ పేరిట సుమారు రూ.80 లక్షల బిల్లుస్వాహా చేశారంటూ ఫిర్యాదులు వచ్చాయి. ఇదే సమయంలో రాక్‌ కటింగ్‌కు సంబంధించినదిగా చెబుతున్న ఎంబీ 152 మాయం కావడం ఆరోపణలకు బలం చేకూర్చింది. ఈ క్రమంలోనే ఎంబీ 152 పోయిందంటూ సర్టిఫైడ్‌ కాపీ కోసం కాంట్రాక్టర్‌ చిందం శ్రీనివాస్‌ వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. ఏఈ వద్ద ఉండాల్సిన ఎంబీ పోయిందని కాంట్రాక్టర్‌ ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఎంబీ మాయం ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో, రూ.80 లక్షలు బిల్లులు చేశారనేది అబద్దమని, కేవలం రూ.1,99,468 మాత్రమే చెల్లించామని ఏఈ అబ్దుల్‌ గఫూర్‌ పేరిట పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఉన్నతాధికారులకు సంబంధం లేకుండా ఇష్టారీతిన ప్రకటన ఇవ్వడంతో అప్పటి ఇన్‌చార్జి కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ సదరు ఏఈ గఫూర్‌కు షోకాజు నోటీసు జారీ చేశారు. ఆ తరువాత రెగ్యులర్‌ కమిషనర్‌ విధుల్లో చేరడంతో ఎంబీ మాయం వ్యవహారం అటకెక్కింది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో కమిషనర్‌గా ప్రఫుల్‌ దేశాయ్‌ బాధ్యతలు చేపట్టడం, ఎంబీ మాయంపై దృష్టి సారించి సస్పెండ్‌ చేయడంతో తొలి వేటు పడింది. ఈ విషయంలో ఏఈ గఫూర్‌ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతోనే సస్పెండ్‌ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఎంబీ బుక్‌ మాయం వ్యవహారంలో బల్దియా ఏఈ సస్పెన్షన్‌

ఫలించిన ‘సాక్షి’ ఏడాది పోరాటం

బుక్‌ను పోగొట్టింది.. ఫిర్యాదు చేసింది కాంట్రాక్టరే

ఏఈకి బదులు కాంట్రాక్టర్‌ పోలీసులను ఆశ్రయించిన వైనం

కమిషనర్‌ ప్రఫుల్‌ తర్వాత ఏం చేస్తారన్న ఉత్కంఠ

ఏఈ పావే!

ఎంబీ మాయం వ్యవహారంలో ఏఈ గఫూర్‌ కేవలం పావు మాత్రమేననే ప్రచారం ఉంది. ఎంబీకి బాధ్యత వహించాల్సింది ఏఈనే కాబట్టి సాంకేతికంగా ఆయనను సస్పెండ్‌ చేయడం సరైనదే అయినా.. ఆయన వెనక ఉన్న పెద్ద తలకాయలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గత ఏడాది ఆగస్టులో ఎంబీ మాయమైందంటూ కాంట్రాక్టర్‌ వన్‌టౌన్‌లో సర్టిఫైడ్‌ కాపీ కోసం ఫిర్యాదు చేయడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డూప్లికేట్‌ ఎంబీ పేరిట తప్పుడు బిల్లులు రూపొందించే వ్యూహంలో భాగంగానే ఫిర్యాదు ఇచ్చి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. గతేడాది ఆగస్టులో ఎంబీ రికార్డును ఏఈ గఫూర్‌ తాను కాంట్రాక్టర్‌ చిందం శ్రీనివాస్‌కు అప్పగిస్తే అతని వద్ద గల్లంతయ్యిందని లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చాడు. ప్రభుత్వ రికార్డు మాయమైతే కాంట్రాక్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు దాన్ని అంగీకరించడం, సర్టిఫైడ్‌ కాపీ జారీచేయడం, దాన్ని బల్దియా అధికారులు ఆమోదించడం విడ్డూరం. దాదాపు 10 నెలల కాలంగా ఎంబీ బుక్‌ విషయంలో బల్దియా చర్యలు తీసుకోకపోవడానికి చిందం శ్రీనివాస్‌కు రావాల్సిన బిల్లలు విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసేందుకు కాలయాపన జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఎంబీ బుక్‌ కాంట్రాక్టర్‌ వద్దే మాయమైందని ఏఈ గఫూర్‌ ఇచ్చిన లేఖ ఆధారంగా ఇంతవరకూ కాంట్రాక్టర్‌పై శాఖాపరంగా చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని నగర ప్రజలు నిలదీస్తున్నారు. దీని మొ త్తానికి గతంలో ఇక్కడ ఇంజినీరింగ్‌ సెక్షన్‌లో పని చేసి బదిలీ మీద వెళ్లిన సీనియర్‌ ఇంజినీరే కారణం అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫస్ట్‌ వికెట్‌ డౌన్‌!1
1/4

ఫస్ట్‌ వికెట్‌ డౌన్‌!

ఫస్ట్‌ వికెట్‌ డౌన్‌!2
2/4

ఫస్ట్‌ వికెట్‌ డౌన్‌!

ఫస్ట్‌ వికెట్‌ డౌన్‌!3
3/4

ఫస్ట్‌ వికెట్‌ డౌన్‌!

ఫస్ట్‌ వికెట్‌ డౌన్‌!4
4/4

ఫస్ట్‌ వికెట్‌ డౌన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement