
సర్కార్ బడికి జైకొట్టి
బడిపై నమ్మకం కల్పించాలని
● తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన టీచర్లు ● స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఉద్యోగులు
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం.. గవర్నమెంట్ టీచర్లపై భరోసా పెంచాలనే పలువురు ఉపాధ్యాయులు తమ పిల్లలను సర్కార్ బడికి పంపుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన ఉంటుందని చెప్పేందుకే తాము పనిచేస్తున్న స్కూళ్లకు పిల్లలను తీసుకెళ్తున్నారు. సార్లే.. తమ పిల్లలను ఊరిలోని బడికి తీసుకొస్తుంటే.. మిగతా తల్లిదండ్రులు తమ పిల్లలనూ చేర్పిస్తున్నారు. ఇటీవల ఉపాధ్యాయులు చేపట్టిన బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఇదే కారణం. తమ పిల్లలను సర్కార్ బడికి పంపుతున్న ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలుస్తున్నారు.
రుద్రంగి(వేములవాడ): తన ముగ్గురు పిల్లలనూ సర్కార్ స్కూళ్లలోనే చదివిపిస్తున్నారు రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం వీరునితండాకు చెందిన టీచర్ భూక్య తిరుపతి. రుద్రంగి ప్రైమరీ స్కూల్‌లో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న భూక్య తిరుపతికి భూక్య ప్రీతిజ, భూక్య నిహారిక, భూక్య అయాన్ అద్వైత్ పిల్లలు. నిహారికను గతంలో తాను పనిచేసిన రుద్రంగి ప్రైమరీ స్కూల్‌కు తీసుకెళ్లేవారు. ప్రస్తుతం మానాలలోని స్కూల్‌లో విధులు నిర్వర్తిస్తున్న తిరుపతి తన కొడుకు అయాన్ అద్వైత్‌ను అదే పాఠశాలకు వెంట తీసుకెళ్తున్నారు. ఇద్దరు కూతుళ్లు భూక్య ప్రీతిజ 10వ తరగతి, భూక్య నిహారిక 7వ తరగతి.. గురుకులాల్లో చదువుతున్నారు.
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం దుంపేటకు చెందిన గుండేటి రవికుమార్–పద్మలత దంపతులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరు మండలంలోని పోసానిపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ దంపతుల చిన్నకుమారుడు లౌకిక్ నాలుగో తరగతి వారు పనిచేస్తున్న పోసానిపేట ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాడు. నిత్యం తమ వెంటే స్కూల్‌కు తీసుకెళ్తున్నారు. వీరిని చూసి గ్రామంలోని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను పాఠశాలకు పంపడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది.
తల్లిదండ్రుల బడికి కొడుకు