
మా ఆస్తులు తిరిగి ఇవ్వండి
మాకు ఇద్దరు కొడుకులు మహేందర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి. వీరిద్దరికి ఆస్తులను ఇచ్చాం. కరీంనగర్‌లోని గణేశ్‌నగర్, కోతిరాంపూర్‌లో మేమిచ్చిన భూముల్లో ఉంటున్నారు. అలాగే నగరంలోని పలుప్రాంతాల్లోని ఆస్తులను దానంగా ఇచ్చాం. ఒక్కొక్కరికి రెండిళ్లు కట్టించి ఇచ్చాం. ఇంత చేస్తే మమ్మల్ని సాదడంలేదు. వృద్ధులమని చూడకుండా కొడుతున్నరు. ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. నా భార్య నడవలేని స్థితిలో ఉంది. అయినా.. వారిలో మానవత్వం లేదు. మా ఆస్తులను తిరిగి మాకే ధారాదత్తం చేసేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి. – కాల్వ శంకర్‌రెడ్డి దంపతులు,
కన్నాపూర్, శంకరపట్నం