
సమస్యలు వేనవేలు.. తీర్చర సార్లూ?
– వివరాలు 8లోu
కరీంనగర్ అర్బన్: సమస్యల పరిష్కారం ఎండమావేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహిస్తుండగా బాధితుల సాంత్వన కరవవుతోంది. పరిపాలన మరింత సులువుగా ఉండాలనే ఉద్దేశంతో జిల్లాల విభజన జరగగా ఆశించినా ఫలితం అంతంతమాత్రమేనన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వచ్చిన అర్జీలే మళ్లీ మళ్లీ వస్తుండగా కాగితాల్లో మాత్రం పరిష్కార శాతం ఎక్కువగా ఉండటం విశేషం. మండలస్థాయిలో పరిష్కారం లేక కలెక్టరేట్‌కు వస్తే అవే అర్జీలను సదరు అధికారులకే ఇస్తుండగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు కూడా సదరు అర్జీల బాధ్యత ఇవ్వడం శోచనీయం. ప్రతీ ప్రజావాణిలో అర్జీలు కుప్పలు తెప్పలుగా వస్తుండగా తమ సమస్యల పరిష్కారానికి ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించగా పలుసమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే చొరవ చూపారు. ప్రధానంగా భూసమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, తదితర అర్జీలు అందజేశారు. ప్రజావాణికి 317 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. ఈ సందర్భంగా పలువురిని సాక్షి పలకరించగా వారి ఆవేదనను వివరించారు.
● ప్రజావాణికి 317 అర్జీలు
మొత్తం అర్జీలు: 317
ఇందులో ఎక్కువగా
మున్సిపల్ కార్పొరేషన్: 54
ఆర్డీవో కరీంనగర్: 19
డీపీవో: 14, తహసీల్దార్ వీణవంక: 13
సీపీ ఆఫీస్: 13
కరీంనగర్ రూరల్ తహసీల్దార్: 12
గంగాధర తహసీల్దార్: 12
తహసీల్దార్ కొత్తపల్లి: 11,
వారధి సొసైటీ: 07