
వర్షాకాలం అప్రమత్తం
కొత్తపల్లి(కరీంనగర్): రానుంది వర్షాకా లం. విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో సొంతంగా రిపేర్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ అధి కారులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో జరిగే ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు వివరించారు.
● తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదు. ప్రమాదకరంగా ఉన్నటువంటి తీగలను గమనించిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయండి.
● ఇళ్లలో బట్టలు ఆరవేసే జీఐ దండెము/వైర్లతో విద్యుత్‌తీగల్లో ఇన్సూలేషన్ సరిగ్గా లేకపోవడంతో విద్యుత్ సరఫరా జరిగి షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ దండెములు ఉపయోగించాలి.
● ఇంటి ముందు రేకులకు కూడా విద్యుత్ సరఫరా జరిగే ప్రమాదం ఉంది. స్తంభం నుంచి విద్యుత్ సరఫరా అయ్యే వైర్లను ఎట్టి పరిస్థితుల్లో దండెంలకు, రేకులకు తగలకుండా జాగ్రత్తపడాలి.
● పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. ఒక వేళ కరెంట్ తీగలు కిందపడి ఉంటే పశువులు వాటిని తాకకుండా అప్రమత్తంగా ఉండాలి.
● ఇంటి వైరింగ్‌కు సరైన ఎర్తింగ్ చేయించాలి. నా ణ్యమైన ప్లగ్గులు, సెల్‌ఫోన్ చార్జర్లను ఉపయోగించాలి.
● సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టి తడిచేతులతో తాకి మా ట్లాడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందునా చార్జింగ్ ఆఫ్ చేసి మాట్లాడాలి.
● పొరపాటున కరెంట్‌షాక్‌కు గురైతే దగ్గరలోని వ్యక్తులు రక్షించాలనే ఆతృతలో అతన్ని ముట్టుకో వద్దు. షాక్‌కు గురైన వ్యక్తిని వేరు చేయడానికి వి ద్యుత్ ప్రవహించని కర్ర, ప్లాస్టిక్ వస్తువులను వాడాలి.
● వ్యవసాయబావుల వద్ద నాణ్యతలేని పంపుసెట్లను వాడొద్దు. కరెంటు మోటార్లు, ఫుట్ వాల్వులు, సర్వీసు వైర్లకు ఇన్సులేషన్ విద్యుత్ ప్రసారం జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని ఏమరపాటున తాకవద్దు. వ్యవసాయ పంపుసెట్లు, స్టార్టర్లను విధిగా ఎర్తింగ్ చేయించుకోవాలి.
● రైతులు, వినియోగదారులు సొంతంగా కరెంట్ పనులు చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌పై ఫ్యూజులు వేయడం వంటి పనులు రైతులు చేయొద్దు. విద్యుత్ సిబ్బందికి చెప్పి చేయించుకోవాలి.
● పొలాల చుట్టూ వేసే విద్యుత్ కంచెలతో రైతులకు ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున రైతులు అప్రమతంగా ఉండాలి.
● విద్యుత్‌కంచె ఏర్పాటు చేయడం చట్టరీత్య నేరం.
● గ్రామీణులు విద్యుత్ సిబ్బంది లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్, సీనియర్ లైన్‌ఇన్‌స్పెక్టర్, సబ్ ఇంజినీర్, సెక్షన్ ఆఫీసర్‌ను సంప్రదించాలి.
వైర్లు తెగితే 1912కు కాల్ చేయాలి
సొంతంగా మరమ్మతు పనులు చేయొద్ద
కరీంనగర్ ఎస్‌ఈ రమేశ్‌బాబు