
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ డైట్ కళాశాల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. స్థానికుల సమాచారం ప్రకారం.. మండలంలోని నర్సింగాపూర్ నుంచి నలుగురు ఆటోలో దైవదర్శనం కోసం వేములవాడ వెళ్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న మరో ఆటో నర్సింగాపూర్ వాసులు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దైవదర్శనం కోసం వెళ్తున్న నలుగురు, ఆటో డ్రైవర్ సంపత్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎల్‌ఎండీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 108కు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.