
‘మోడల్’లో ఇంటర్ ప్రవేశాలు
● ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ● ఈనెల 20 వరకు గడువు ● ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ● జిల్లాలో 11 మోడల్ స్కూళ్లు ● ఒక్కో పాఠశాలలో 160 సీట్లు
కరీంనగర్: ఇంటర్మీడియట్ ఆంగ్లమాధ్యమంలో చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు ఓ వరం. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రవేశాల కోసం ఈనెల 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ వెలువడింది. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
జిల్లాలో 11 ఆదర్శ పాఠశాలలు
జిల్లాలో చొప్పదండి మండలం రుక్మాపూర్, కరీంనగర్ మండలం ఎలగందల్, మానకొండూర్ మండలం పోచంపల్లి, రామడుగు, వీణవంక, జమ్మికుంట మండలం టేకుర్తి, చిగురుమామిడి మండలం ముల్కనూర్, గంగాధర, శంకరపట్నం, తిమ్మాపూర్, సైదాపూర్‌లో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ప్రతీ స్కూల్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రతీ గ్రూపునకు 40 మంది విద్యార్థుల చొప్పున, ఒక్కో పాఠశాలలో 160 మందికి అవకాశం కల్పించారు.
బాలికలకు హాస్టల్ సౌకర్యం
ఆదర్శ పాఠశాలల్లో బాలికలకు మాత్రమే హాస్టల్ సౌకర్యం ఉంది. పూర్తిస్థాయి భవన నిర్మాణాలు, మౌలిక వసతులు లేని పాఠశాలల్లో బాలికలకు హాస్టల్ వసతి కల్పించడం లేదు. హాస్టల్‌లో 9,10వ తరగతులు, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంద మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంది. హాస్టల్‌కు కనీసం 3 కిలోమీటర్ల, ఆపై దూరంగా ఉండేవారు అర్హులు.
వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్
ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఈనెల 20వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 26న మెరిట్ లిస్టు, 27 నుంచి 31 వరకు ఎంపికై న విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. జూన్ 2 నుంచి తరగతులు ప్రారంభిస్తారు. ఇంటర్ విద్యతో పాటు ఎంసెట్, నీట్, సీఏ, సీపీటీ కోచింగ్‌తో పాటు వివిధ ఉన్నతస్థాయి చదువుకు మార్గదర్శనం చేస్తారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేస్తారు. ఆసక్తి గల విద్యార్థులు అడ్మిషన్ పొందడానికి ఇంటర్నెట్ సెంటర్ లేదా మీసేవ, ఈసేవ సెంటర్‌ను సంప్రదించాలి.
ప్రతి గ్రూపునకు 40 సీట్లు.. కేటాయింపులు ఇలా..
కేటగిరి సీట్లు జనరల్ బాలికలు
జనరల్ 20 13 07
ఎస్సీ 06 04 02
ఎస్టీ 02 01 01
బీసీ–ఏ 03 02 01
బీసీ–బీ 04 03 01
బీసీ–సీ 00 00 00
బీసీ–డీ 03 02 01
బీసీ–ఈ 02 02 00
దరఖాస్తు చేసుకోవాలి
మోడల్ స్కూల్‌లో ఇంటర్‌ప్రవేశాలకు ఈనెల 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఉచిత వసతి, సదుపాయాలు, మెరుగైన బోధన, ఫలితాల్లో ముందంజలో ఉంటున్న మోడల్ స్కూళ్లను అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– జనార్దన్‌రావు, డీఈవో

‘మోడల్’లో ఇంటర్ ప్రవేశాలు