రామగుండం సీపీ పేరిట ఫేక్‌ ఫేస్‌బుక్‌ ఖాతా | - | Sakshi
Sakshi News home page

రామగుండం సీపీ పేరిట ఫేక్‌ ఫేస్‌బుక్‌ ఖాతా

May 27 2025 12:04 AM | Updated on May 27 2025 12:04 AM

రామగు

రామగుండం సీపీ పేరిట ఫేక్‌ ఫేస్‌బుక్‌ ఖాతా

గోదావరిఖని: రామగుండం పోలీస్‌కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేరు, ఫొటోతో సైబర్‌నేరగాళ్లు ఫేక్‌ ఫేస్‌బుక్‌ సృష్టించారు. ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను అనుమతించి డబ్బులు పంపించాలని అడిగారు. అంతేకాదు.. అధికారి ఫ్రెండ్స్‌, బంధువులు, ఆర్మీ ఆఫీసర్‌ బదిలీ అయ్యారని, దీంతో ఇంటిసామగ్రి తక్కువ ధరకు విక్రయిస్తున్నామని అకౌంట్‌లో పోస్టు చేశారు. పోలీసు అధికారి పుట్టినరోజు సందర్భంగా బహుమతులు పంపించేలా చాట్‌చేసి నమ్మించారు. స్పందించిన రామగుండం పోలీస్‌ కమిషనర్‌.. పోలీస్‌ అధికారి ప్రొఫైల్‌ ఫొటో చూసి అధికారే చాట్‌ చేస్తున్నారని, ఇది నమ్మి మోసపోవద్దని, ఎవరూ అకౌంట్‌కు డబ్బులు పంపించరాదన్నారు.

పదోన్నతులు, బదిలీలు వేసవి సెలవుల్లో చేపట్టాలి

టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను వంచిస్తోందని, వెంటనే పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని, బదిలీలు, పదోన్నతులు వేసవి సెలవుల్లో చేపట్టాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఎల్లారెడ్డిపేటలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. కొన్నేళ్లుగా వివిధ అత్యవసర పనుల కోసం జీపీఎఫ్‌ లోన్‌, పార్ట్‌ ఫైనల్‌ బిల్లులు చెల్లించక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యోగుల 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఎన్నికల ముందు సీఎం ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే చెల్లించాలని అన్నారు. పీఆర్సీ కమిటీ నివేదికను వెంటనే తెప్పించి పీఆర్సీ ప్రకటించాలన్నారు. ఐదేళ్లకు ప్రకటించాల్సిన పీఆర్సీని ఏడు సంవత్సరాలైనా ప్రకించకుండా కాలయాపన చేయడం అన్యాయమని అన్నారు. జిల్లా అధ్యక్షుడు దుమాల రామనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని పాఠశాలల్లో నియామకమైన పారిశుధ్య కార్మికులకు చెల్లించాల్సిన ఐదు నెలల జీతం ఇవ్వాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు డబ్బెడ హన్మండ్లు, మందాటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర బాధ్యులు సూర భాస్కర్‌, బొజ్జ కృష్ణ, మండల అధ్యక్షులు కదిరే శ్రీనివాస్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

రామగుండం సీపీ పేరిట   ఫేక్‌ ఫేస్‌బుక్‌ ఖాతా 1
1/1

రామగుండం సీపీ పేరిట ఫేక్‌ ఫేస్‌బుక్‌ ఖాతా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement