
పశువులకు నీటి గోస
● రహదారిపై రైతు దంపతుల నిరసన
గన్నేరువరం: వ్యవసాయ బావికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో పశువులకు తాగునీటి గోస ఏర్పడిందని, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్‌లోని ప్రధాన రహదారిపై రైతు దంపతులు సోమవారం పశువులతో నిరసన చేపట్టారు. గ్రామానికి చెందిన కొర్వి పోశయ్య– సుశీల దంపతులకు వ్యవసాయంతో పాటు పాడి పశువుల పెంపకం చేపట్టారు. ఇటీవల ఓ కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలతో వెళ్తున్న లారీ ఈ ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్ వైర్లకు తగలడంతో వైర్లు తెగిపోయాయి. ఇక్కడి విద్యుత్ స్తంభం నుంచి పోశయ్య బావికి సరఫరా నిలిచిపోయింది. 15రోజులుగా విద్యుత్ పునరుద్ధరణను సంబంధిత అధికారులు మరిచారని ఆ రైతు దంపతులు ఆరోపించారు.