
600 మంది.. 8 గంటలు
కరీంనగర్‌కల్చరల్: 600మంది కళాకారులు.. 29 గ్రూపులు.. 8గంటల నిర్విరామ ప్రదర్శనతో చిడతల భజనలో వండర్‌బుక్ ఆప్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ కరీంనగర్ ఫోక్ అకాడమీ, కళారవళి సోషియో కల్చరల్ అసోసియేషన్, సల్వాజీ ఈవెంట్స్ కల్చరల్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కళాభారతిలో గురువారం ప్రపంచ రికార్డ్ కోసం చిడతల భజన ప్రదర్శించారు. 8గంటల నిర్విరామ ప్రదర్శనతో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించారు. ఇండియా కో– ఆర్డినేటర్ బింగి నరేందర్‌గౌడ్ సర్టిఫికెట్ అందించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి 29 మందికి ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, మెదక్, నిజామాబాద్, పెద్దపల్లి, ఆదిలా బాద్ జిల్లాల నుంచి కళాకారులు పాల్గొన్నారు. మున్సిపల్ అడిషనల్ కమిషనర్ సువార్త, ఆర్డీవో కె.మహేశ్, టి.అనిల్‌రాజు, గోదావరిఖని కళా సంఘాల సమైక్య అధ్యక్షుడు కె.రమణయ్య, ఫోక్ ఆర్ట్స్ అకాడమీ కో– ఆర్డినేటర్ జ్ఞాన ప్రకాశ్, సల్వాజీ ప్రవీణ్, విష్ణుదాస్, గోపాలరావు, జి.కృపాదానం, మురళి, మధు, సంధ్య పాల్గొన్నారు.
● చిడతల భజనకు వండర్ బుక్‌ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

600 మంది.. 8 గంటలు