కొండగట్టులో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

కొండగట్టులో భక్తుల సందడి

May 9 2025 1:28 AM | Updated on May 9 2025 1:28 AM

కొండగ

కొండగట్టులో భక్తుల సందడి

● ప్రైవేట్‌ ఓబీల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం ● పట్టించుకోని సింగరేణి అధికారులు ● ప్రమాదాల తీరుపై కార్మిక సంఘాల ఆగ్రహం

మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయంలో గురువారం భక్తుల సందడి కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దీక్షాపరులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు హరిహరనాథ్‌, సునీల్‌ కుమార్‌, రాములు, సుధాకర్‌ భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు.

గోదావరిఖని: కండీషన్‌లో లేనియంత్రాలు.. నామమాత్రపు రక్షణ చర్యలు.. వెరసి కాంట్రాక్టు కార్మికుల జీవితాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి.. ఏదైనా ప్రమాదం జరిగితే ఉరుకులు, పరుగులు పెట్టించే అధికారులు.. రక్షణచర్యల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టార్గెట్‌ పేరిట ప్రైవేట్‌ ఓబీలపై ఒత్తిడి పెంచుతున్న యాజమాన్యం.. రక్షణ విషయంలో పట్టించుకోవడం లేదని అంటున్నారు. ప్రైవేట్‌ ఓబీల్లో మరమ్మతులు చేయకుండా వాహనాలను పనులకు పురమాయించడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికులకు రక్షణ విషయంలో శిక్షణ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. ప్రతీమూడు నెలలకోసారి ఇతర రాష్ట్రాల కార్మికులు ఇక్కడ నుంచి వెళ్లిపోవడం, మళ్లీ కొత్తవాళ్లు రావడంతో నిరంతర ప్రక్రియగా సాగుతోంది.

సూపర్‌వైజరే డైవర్‌..

జీడీకే–5 ఓసీపీలో ఇటీవల ప్రమాదం జరిగి కాంట్రాక్టు కార్మికుడు వికాస్‌ కుమార్‌ మృతి చెందాడు. వాస్తవానికి వికాస్‌ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే ట్యాంకర్‌ డ్రైవర్‌ విధులకు రాకపోవడంతో సూపర్‌వైజర్‌ను డ్రైవర్‌ పనికి పురమాయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ట్యాంకర్‌పై అవగాహనలేని వికాస్‌.. నడుపుతున్న క్రమంలో అదుపుతప్పింది. ప్రాణాలు కాపాడుకునేందుకు సీట్లో నుంచి దూకే ప్రయత్నంలో వెనుక టైర్‌ కింద పడి మృతి చెందాడు. అదే రెగ్యులర్‌ డ్రైవర్‌ నడిపి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని తోటి కార్మికులు చెబుతున్నారు.

అంతా వారికనుసన్నల్లోనే..

సింగరేణిలో ప్రైవేట్‌ ఓబీ కాంట్రాక్టర్ల పెత్తనం కొనసాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారిపై చర్యలు తీసుకుంటే కేంద్ర మంత్రుల స్థాయి నుంచి ఫోన్లు వస్తుండడంతో అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కార్మికుల సంక్షేమం నుంచి వేతనాలు, సౌకర్యాల కల్పన విషయంలో కూడా కాంట్రాక్టర్లు చెప్పిందే వేదవాక్కుగా సాగుతోందని పేర్కొంటున్నారు.

విచారణ జరపాలి..

జీడీకే–5 ఓసీపీలో జరిగిన ప్రమాదంపై డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ మైన్స్‌ సేఫ్టీ అధికారి ఆధ్వర్యంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఓబీల్లో చాలా వరకు యంత్రాలు కండిషన్‌లో ఉండటం లేదని, ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వాపోతున్నారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో బోల్తాపడిన ట్యాంకర్‌ కండీషన్‌ కూడాసరిగా లేదని అంటున్నారు.

బోల్తాపడిన వాటర్‌ట్యాంకర్‌(ఫైల్‌)

కొండగట్టులో భక్తుల సందడి1
1/2

కొండగట్టులో భక్తుల సందడి

కొండగట్టులో భక్తుల సందడి2
2/2

కొండగట్టులో భక్తుల సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement