జపాన్‌– ఆసియా యువ విజ్ఞాన మార్పిడి కార్యక్రమానికి శుభశ్రీ | - | Sakshi
Sakshi News home page

జపాన్‌– ఆసియా యువ విజ్ఞాన మార్పిడి కార్యక్రమానికి శుభశ్రీ

Published Wed, Mar 26 2025 12:44 AM | Last Updated on Wed, Mar 26 2025 12:42 AM

కొత్తపల్లి(కరీంనగర్‌): జపాన్‌ ఆసియా యువ విజ్ఞాన మార్పిడి కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీంనగర్‌ పద్మనగర్‌లోని పారమిత హెరిటేజ్‌ పాఠశాల విద్యార్థిని శుభశ్రీ సాహు ఎంపికై నట్లు చైర్మన్‌ ఇ.ప్రసాదరావు తెలిపారు. జపాన్‌లో జూన్‌ 15 నుంచి 21వ తేదీ వరకు జరగబోయే ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో 14 ఆసియా దేశాల నుంచి యువత పాల్గొంటుండగా.. శుభశ్రీకి చోటు లభించడం గర్వంగా ఉందన్నారు. సాకురా ఎక్సేంజ్‌ ప్రోగ్రాం అని పిలవబడే ఈ కార్యక్రమంలో రైతుల కోసం వినూత్నంగా తయారు చేసిన వ్యవసాయ యంత్రాన్ని ప్రదర్శించనుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అయ్యే ఖర్చులన్నింటిని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. అదేవిధంగా జాతీయ స్టార్టప్‌ దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌లో నిర్వహించే ఉద్యోగ మహోస్తవ్‌–25లో పాల్గొనడానికి ఎంపికై నట్లు తెలిపారు. ఈ మేరకు శుభశ్రీ, గైడ్‌ టీచర్‌ లలిత్‌ మోహన్‌ సాహును కలెక్టర్‌ పమేలా సత్పతి తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement