చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. విద్యాలయంలో ఆరోతరగతిలో ప్రవేశానికి 80 సీట్లకు నిర్వహించిన ప్రవేశపరీక్షలో ఎంపికై న విద్యార్థుల హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచారు. నవోదయ వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని ప్రిన్సిపాల్ మంగతాయారు తెలిపారు. అనంతరం విద్యాలయంలో తొమ్మిదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. రిజర్వేషన్, కేటగిరీ పద్ధతిలో 14 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు.
కలప పట్టివేత
చందుర్తి(వేములవాడ): రాజన్న సిరిసిల్ల– జగిత్యాల జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న చందుర్తి– మోత్కులరావుపేట గ్రామాల మధ్య మంగళవారం వేకువజామున అక్రమంగా టేకు కలప తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు అటవీశాఖ వేములవాడ డిప్యూటీ రేంజ్ అధికారి రాఘవేందర్‌రావు తెలిపారు. కలపను స్వాధీనం చేసుకుని, ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు వివరించారు. చందుర్తి, సనుగుల బీట్ అధికారులు బాలకృష్ణ, అనిత, బేస్‌క్యాంప్ సిబ్బంది తిరుపతి, శంకర్ పాల్గొన్నారు.