ఉపాధి పనికి వెళ్లి.. కుప్ప‘కూలీ’ | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పనికి వెళ్లి.. కుప్ప‘కూలీ’

Mar 23 2025 9:10 AM | Updated on Mar 23 2025 9:06 AM

చందుర్తి (వేములవాడ): ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఓ కూలీ మృతిచెందిన ఘటన చందుర్తి మండలం ఎన్గల్‌ గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మండలంలోని ఎన్గల్‌ గ్రామానికి చెందిన పసుల లచ్చయ్య (58) శనివారం గ్రామంలో ఉపాధి పథకంలో భాగంగా మట్టిరోడ్డు నిర్మాణ పనులకు వెళ్లాడు. ఉదయం 9.30 గంటలకు భోజనం చేసేందుకు చెట్టు కిందికి వస్తున్న క్రమంలోనే స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే తోటి కూలీలు మోటారు సైకిల్‌పై వేములవాడ తరలించేందుకు మల్లారం గ్రామం వరకు వెళ్లగా.. అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా వారంరోజులుగా ఎండలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా వడదెబ్బతో మృతి చెందాడని అనుమానాలు వ్యక్తం కావడంతో మృతదేహానికి పోస్టుమార్టం చేయించినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య రాజేశ్వరి, కుమారుడు, కూతురు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయాలు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగుండారం శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రగాయాలకు గురయ్యా రు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. వీర్నపల్లి మండలం మద్దిమల్ల తండాకు చెందిన భూక్య జ వహర్‌, లాల్‌సింగ్‌ ద్విచక్ర వాహనంపై మండలంలోని రాచర్లగొల్లపల్లికి వచ్చి తిరిగి వెళ్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. ఇద్దరికి గాయాలు కాగా లాల్‌సింగ్‌ పరిస్థితి విషమంగా ఉంది. ప్రైవేట్‌ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

సిరిసిల్లలో..

సిరిసిల్లక్రైం: సిరిసిల్ల బైపాస్‌ రోడ్‌లో కారు, బైక్‌ ఢీకొన్న ఘటనలో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల వివరా లు.. సిరిసిల్ల పట్టణం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన వ డ్లూరి రాజు, వడ్లూరి కిషన్‌ బైక్‌పై వెళ్తుండగా కా రు ఢీకొట్టింది. ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రి, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌ తరలించారు.

చెవికమ్మ అప్పగింత

శంకరపట్నం(మానకొండూర్‌): ఆర్టీసీ బస్సులో ఓ మహిళ చెవికమ్మ పోగొట్టుకోగా కండక్టర్‌ సుధాకర్‌ వెతికి బాధితురాలి బంధువుకు అందించిన ఘటన కేశవపట్నం బస్టాండ్‌లో వెలుగుచూసింది. హుజురాబాద్‌కు చెందిన ఓ మహిళ శనివారం హనుమకొండలో నిజామాబాద్‌ డిపో బస్సు ఎక్కింది. హుజూరాబాద్‌ బస్టాండ్‌ రాగానే బస్సు దిగింది. చెవి కమ్మ కనిపించకపోవడంతో బస్సు సీట్లో పడిపోయి ఉంటుందని, టికెట్‌ ఆధారంగా కండక్టర్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. దీంతో కండక్టర్‌ బస్సులో వెతికాడు. సదరు మహిళ కూర్చున్న సీటు వద్ద చెవికమ్మ కనిపించడంతో బాధితురాలికి విషయం తెలిపాడు. కేశవపట్నంలో తమ బంధువులు ఉన్నారని, వారిని పంపిస్తానని బాధిత మహిళ చెప్పడంతో.. స్వరూప అనే మహిళకు కండక్టర్‌ చెవికమ్మ అందించారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): పిల్ల లు పుట్టడం లేదనే మనస్థాపంతో పురుగుల మందుతాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన తంగళ్లపల్లి మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై రామ్మోహన్‌ తెలిపిన వివరాలు. మామిండ్ల మహేశ్‌(30)కు నాలుగేళ్ల క్రితం కల్పనతో వివాహమైంది. పిల్ల లు పుట్టడం లేదని మానసికంగా వేదనకు గురయ్యాడు. ఈనెల 17న పురుగుల మందు తాగగా.. ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఉపాధి పనికి వెళ్లి.. కుప్ప‘కూలీ’1
1/2

ఉపాధి పనికి వెళ్లి.. కుప్ప‘కూలీ’

ఉపాధి పనికి వెళ్లి.. కుప్ప‘కూలీ’2
2/2

ఉపాధి పనికి వెళ్లి.. కుప్ప‘కూలీ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement