కరీంనగర్ కార్పొరేషన్: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బద్దలు కొట్టాల్సింది రెగ్యులేటరీ గేట్లను కాదని, కేసీఆర్ ఫామ్‌హౌస్‌నని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం మాట్లాడుతూ.. సాగునీటి కోసం రెగ్యులేటరీ గేట్లను బద్దలు కొడుతామని, బడ్జెట్‌లో కరీంనగర్‌కు కేటాయింపులు శూన్యమని గంగుల చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. స్మార్ట్‌సిటీకి రూ.179 కోట్లు, శాతవాహన యూనివర్సిటీకి రూ.35కోట్లు, వరంగల్ కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్స్‌కు రూ.41 కోట్లు కేటాయించారని తెలిపారు. మానేర్ రివర్ ఫ్రంట్‌కు నిధులు ఇవ్వకపోతే జిల్లాకే రాలేదంటున్నారని ఎద్దేవా చేశారు. కేబుల్ బ్రిడ్జి పనుల్లో నాణ్యతాలోపం, డైనమిక్‌లైట్ల పేరిట కోట్ల వృథాకు కారణమెవరో ప్రజలకు తెలుసన్నారు. నాయకులు శ్రవణ్ నాయక్, కాంరెడ్డి రాంరెడ్డి, స్వామిగౌడ్, దన్నసింగ్, అర్ష మల్లేశం, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, కుర్ర పోచయ్య పాల్గొన్నారు.
‘స్మార్ట్‌సిటీ నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి’
కరీంనగర్‌టౌన్: స్మార్ట్‌సిటీ హోదా, రూ.800 కోట్ల నిధులతో కరీంనగర్‌ను అభివృద్ధి చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌కే దక్కుతుందని నగర మాజీ మేయర్ వై.సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్‌లోని ఎస్‌బీఎస్ ఫంక్షన్‌హాల్‌లో కరీంనగర్ నగర కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సునీల్‌రావు, కృష్ణారెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16నెలలైనా కరీంనగర్ అభివృద్ధికి ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. మాజీ మేయర్ డి.శంకర్, బాస సత్యనారాయణరావు, గుగ్గిల్లపు రమేశ్, కోమల ఆంజనేయులు, బంగారు రాజేంద్రప్రసాద్, వాసాల రమేశ్, బోయిన్‌పల్లి ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.
గడువులోగా పనులు పూర్తి చేయాలి
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో అమృత్‌భారత్ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ సూచించారు. కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో అమృత్‌భారత్ పథకంలో కొత్తగా నిర్మించిన రెండో అదనపు ఫ్లాట్‌ఫాం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎక్సలెటర్‌ను శుక్రవారం పరిశీలించారు. రైల్వేస్టేషన్‌లో 90శాతం వరకు పనులు పూర్తయినట్లు అధికారులు జీఎంకు తెలిపారు. మిగితా పనులను త్వరలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు. డీఆర్‌ఎం అంబరీష్ కుమార్‌జైన్, స్టేషన్‌మేనేజరు రవీందర్ పాల్గొన్నారు.
నెలకు రెండు ప్రసవాలు చేయాలి
మానకొండూర్: ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకు రెండు ప్రసవాలు తప్పనిసరిగా చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ సూచించారు. మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రిజిష్టరు, రికార్డులు పరిశీలించారు. ప్రతీనెల ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని, మందులు సరిపడ ఉన్నాయా అంటూ వైద్యాధికారులను ఆరా తీశారు. కుక్కకాటుకు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతీరోజు విధులకు హాజరు కావాలని ఆదేశించారు. బీపీ, షుగర్ మందులు నెలకు సరిపడా ఇవ్వాలన్నారు. ఆస్పత్రి వైద్యాధికారి సల్మాన్, సీహెచ్‌వో బి.రాజునాయక్, జుబేర్, ఎల్‌టీ.మునీందర్ పాల్గొన్నారు.
‘బద్దలు కొట్టాల్సింది కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను’
‘బద్దలు కొట్టాల్సింది కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను’