మండలంలోని పలు ప్రాంతాలలో ఇప్పటికే అనేక గుట్టబోర్లు మాయమయ్యాయి. పలుకుబడి ఉన్నవారు యథేచ్ఛగా వాటిని తవ్వి మొరం వ్యాపారం చేస్తున్నారు. పెద్దపెద్ద యంత్రాలతో రోజుల వ్యవధిలోనే అటవీప్రాంతంలోని గుట్టబోర్ల ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు.
– పెద్దనవేణి రాగన్న, బుగ్గారం
చర్యలు తీసుకుంటాం
ఎవరైనా అనుమతి లేకుండా గుట్టబోర్లను తవ్వితే చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో మొరం కోసం తవ్విన ప్రాంతాలను స్థానిక అధికారులతో కలిసి పరిశీలిస్తాం. మొరం తవ్వకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. వ్యవసాయ భూముల సమీపంలో ఆక్రమణలను అడ్డుకుంటాం.
– మాజిద్, తహసీల్దార్, బుగ్గారం
పట్టించుకోవడం లేదు