ఆహార నాణ్యతపై తనిఖీలు చేపట్టండి | - | Sakshi
Sakshi News home page

ఆహార నాణ్యతపై తనిఖీలు చేపట్టండి

Mar 20 2025 1:46 AM | Updated on Mar 20 2025 1:44 AM

● కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌ అర్బన్‌: జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ హాస్టళ్లు, హోటళ్లు, ఆహార తయారీ కేంద్రాల్లో విరి విగా తనిఖీలు చేసి ఆహార నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. ఆహార నాణ్యతపై ఫుడ్‌సేఫ్టీ జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆహార కల్తీ, నాసిరకమైన ఆహారం తయారు చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. హోటళ్లు, ఐస్‌ పాయింట్లు, పండ్ల మార్కెట్లలో తనిఖీలు చేయాలని అన్నారు. ప్రభుత్వ వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార వస్తువులు, సరుకులను పరిశీలించాలని సూచించారు. సీపీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో నడుస్తున్న ఆహార తయారీ కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు. అడిషనల్‌ కలెక్టర్లు ప్రఫుల్‌దేశాయ్‌, లక్ష్మీకిరణ్‌, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ సునీత, డీఎంహెచ్‌వో వెంకటరమణ, డీఈవో జనార్దన్‌రావు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు

మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు తీసుకోవా లని కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా పోలీస్‌, ఎకై ్సజ్‌ సహా వివిధశాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.పోలీస్‌, ఎకై ్సజ్‌, విద్యాశాఖ అధికారులు కళాశాలలు, వివిధ వసతి గృహాలను సందర్శించాలని అన్నారు. సీపీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ పోలీసుశాఖ తరఫున ఇప్పటికే జిల్లాలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.

ముత్యాల తలంబ్రాలు బుక్‌ చేసిన కలెక్టర్‌

విద్యానగర్‌: శ్రీరామనవమి సందర్భంగా ఈనెల 6న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణ ముత్యాల తలంబ్రాలను బుధవారం కలెక్టర్‌ పమేలా సత్పతి బుక్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement