థాయ్‌లాండ్‌కు మరో విమానం | - | Sakshi
Sakshi News home page

థాయ్‌లాండ్‌కు మరో విమానం

Mar 19 2025 12:45 AM | Updated on Mar 19 2025 12:44 AM

బాధితులను తీసుకొచ్చేందుకు పంపనున్న కేంద్రం

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: కొలువుల కోసమని వెళ్లి థాయ్‌లాండ్‌ పరిసరదేశాల్లో సైబర్‌ కేఫ్‌ల్లో చిక్కుకున్న యువతను ఇండియాకు తీసుకొచ్చే ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఇటీవల అక్కడ చిక్కుకున్న యువత దయనీయస్థితిని ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. అమిత్‌ షా ఆదేశాలతో మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో చిక్కుకున్న 540మంది భారతీయులను రెండు సైనిక విమానాల్లో సురక్షితంగా ఢిల్లీకి తరలించారు. వారిని సీబీఐ, ఎన్‌ఐఏ, ఐబీ తదితర దర్యాప్తు సంస్థలు విచారించిన అనంతరం స్వరాష్ట్రాలకు పంపారు. తా జా సమాచారం ప్రకారం.. మరికొందరు భారతీయ యువతీ, యువకులు ఇంకా అక్కడ చిక్కుకుపోయారని, వారిని కూడా రక్షించేందుకు కేంద్ర హోంశాఖ మరో విమానాన్ని థాయ్‌లాండ్‌కు పంపనుందని సమాచారం. ఈ వారాంతంలోగా మరో విమానం ద్వారా వారిని తీసుకురానున్నారని తెలిసింది.

ఆస్తిపన్నులో వడ్డీమాఫీ చేయాలి

కరీంనగర్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సి పాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్నులపై వడ్డీమాఫీ పథకాన్ని ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ మాదిరి గా మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ వడ్డీమాఫీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన ఆస్తి పన్నులను వసూలు చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో వీధి దీపాలు సరిగా వెలగడం లేదని, పారిశుధ్యం అంతంత మాత్రంగానే ఉందన్నారు. వేసవికాలం ప్రారంభానికి ముందే పలుకాలనీల్లో రోజూ తప్పించి రోజూ నీటి సరఫరా సాగుతోందని, రానున్న రోజుల్లో మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. నాయకులు సాయికృష్ణ, చందు, రవి, శ్రీనివాస్‌, ఇర్బాన్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఏసీపీ నరేందర్‌కు పదోన్నతి

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీగా పనిచేస్తున్న జి.నరేందర్‌కు అడిషనల్‌ ఎస్పీగా పదోన్నతి కల్పి స్తూ డీజీపీ కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

మీ సేవల్లో ‘యువ వికాసం’ సందడి

కరీంనగర్‌రూరల్‌: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. మంగళవారం నుంచి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఏప్రిల్‌ 5వరకు అవకాశముంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థికసాయం మంజూరు చేస్తారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ఆర్థికసాయం అందిస్తారు. కేటగిరీ–1లో రూ. లక్షకు 80శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. మిగితా 20శాతం బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేస్తారు. కేటగిరీ–2లో రూ.లక్ష నుంచి రూ.2లక్షలకు 70శాతం సబ్సిడీ, కేటగిరీ–3లో రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు 60శాతం సబ్సిడీ, 40శాతం బ్యాంకు రుణం అందజేస్తారు.75 రకాల యూనిట్లకు అవకాశముంది.

థాయ్‌లాండ్‌కు  మరో విమానం
1
1/2

థాయ్‌లాండ్‌కు మరో విమానం

థాయ్‌లాండ్‌కు  మరో విమానం
2
2/2

థాయ్‌లాండ్‌కు మరో విమానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement