● దేశ వ్యాప్తంగా 54 మందికి అవకాశం ● అందులో మంచిర్యాల జిల్లా విద్యార్థినికి ఛాన్స్..
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి సాయిలు సాయిశ్రీవల్లి వినూత్న ఆలోచనలను పంచుకునే అంతర్జాతీయ వేదిక జపాన్ సకురా సైన్స్ ఎకై ్సంజ్ కార్యక్రమానికి ఎంపికై ంది. దేశం నుంచి 54 మంది విద్యార్థులను కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ ఎంపిక చేయగా తెలంగాణ నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. ఇందులో మంచిర్యాల జిల్లాకు చెందిన సాయిశ్రీవల్లి ఒకరు. జపాన్ సకురా కార్యక్రమంలో భాగంగా జూన్ 15 నుంచి 21 వరకు విద్యార్థులు పర్యటించనున్నారు. జాతీయ ఇన్‌స్పైర్ కార్యక్రమం అత్యుత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులు 15 ఏళ్ల వయసు కలిగి ఉండి 10 నుంచి 12 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు జపాన్ సైన్స్ ఎకై ్సంజ్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు.
రుతుమిత్ర కిట్ ప్రాజెక్టు ప్రదర్శనతో..
సాయి శ్రీవల్లి సీ్త్రల నెలవారి రుతుక్రమంలో వినియోగిస్తున్న రసాయనిక శానిటరీ ప్యాడ్‌తో కలిగే ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపాలని శ్రీస్ రుతుమిత్ర కిట్ రూపొందించింది. రుతుక్రమ సమయంలో రసాయనిక శానిటరీ ప్యాడ్ వినియోగ సమస్యలు దూరం చేసేందుకు క్లాత్‌ప్యాడ్ వినియోగం, వాటిని సులభంగా శుభ్రపరిచే పరికరం తయారు చేసి జాతీయస్థాయి ఇన్‌స్పైర్ పోటీలకు ఎంపికై ంది. 2020–21లో ఢిల్లీలో నిర్వహించిన ఇన్‌స్పైర్ పోటీల్లో పాల్గొని ఉత్తమంగా నిలిచింది. 2023లో ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఇంటర్ ప్యునర్షిప్ 2023ఫైన్ కార్యక్రమానికి ఆహ్వానం అందుకుని భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మతో ప్రాజెక్టు రూపకల్పన అనుభవనాలపై పంచుకున్నారు. తాజాగా జపాన్ సకురాకు ఎంపికై ంది. శ్రీవల్లిని డీఈవో యాదయ్య అభినందించారు.