కొడుకుపై కత్తితో తండ్రి దాడి | - | Sakshi
Sakshi News home page

కొడుకుపై కత్తితో తండ్రి దాడి

Jun 17 2024 1:16 AM | Updated on Jun 17 2024 1:16 AM

కొడుకుపై కత్తితో తండ్రి దాడి

కొడుకుపై కత్తితో తండ్రి దాడి

కోరుట్ల రూరల్‌: మండలంలోని మోహన్‌రావుపేట గ్రామంలో కొడుకును తండ్రి కత్తితో పొడిచిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసుల వివరాలు.. మోహన్‌రావుపేటకు చెందిన కోట గంగారాజంకు రాజేశ్‌, రాకేశ్‌ కుమారులు. గంగారాజం, అతడి కుమారుల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో అందరూ కలిసి గంగారాజం అత్త భూమక్క ఇంటి వద్ద మాట్లాడుకుంటున్నారు. ఇంతలో పెద్ద కుమారుడు రాజేశ్‌, చిన్న కుమారుడు రాకేశ్‌ మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో గంగారాజం పెద్ద కుమారుడు రాజేశ్‌పై కత్తితోదాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి, పరిస్థితి విషమంగా ఉండటంతో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement