
క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు
కరీంనగర్‌కల్చరల్: నగరంలోని సెయింట్ మార్క్ చర్చి గ్రౌండ్‌లో శుక్రవారం సీఎస్‌ఐ సంఘాల ఆధ్వర్యంలో క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు ప్రారంభమయ్యాయి. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో విశేష ఆదరణ కలిగిన బ్రదర్ జెన్నీ క్రిస్టాఫర్ మాట్లాడుతూ క్రీస్తు చూపించిన మార్గంలో నడిస్తే భూమి భూపల స్వర్గం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రూబెన్ మార్క్, ప్రిసిల్ల పరిమళ రూబెన్ మార్క్, పాల్ కొమ్మాలు, ఎస్.జాన్, ఆర్.ప్రసాద్, బి.ప్రసాద్, ఎ.మధుమోహన్, డీకన్ పింటు, డీకన్ రోజి, రెనాల్డ్, పాస్టర్ తిమోతి, పాస్టర్ క్రిస్టొఫర్, ఇండిపెండెంట్ పాస్టర్స్, స్థానిక సంఘాల పెద్దలు, ఇవాంజిలిస్ట్‌లు పాల్గొన్నారు.