
వడ్డిస్తున్న సభ్యులు
కరీంనగర్‌రూరల్: మాజీ ఎంపీ, కాంగ్రెస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ను శనివారం హుస్నాబాద్‌లో కరీంనగర్ మండల కాంగ్రెస్ నాయకులు కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలుస్తున్నానరని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందంటూ ప్రభాకర్‌ను అభినందించారు. కలిసిన వారిలో మండల నాయకులు మాసం సుధాకర్, ఆవుల గౌతమ్, బుచ్చాల అనిల్, గసికంటి శ్రీనివాస్ తదితరులున్నారు.
అల్పాహారం పంపిణీ
కరీంనగర్‌రూరల్: లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320జీ ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా శనివారం మాతా శిశు ఆస్పత్రి ఆవరణలో రోగులతో పాటు బంధువులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు చింతల కిషన్, మాసినేని చక్రాధర్–స్వాతి దంపతులు, కొంజర్ల నవీన్, రావికంటి కృష్ణకిశోర్, మంద వెంకటరమణారెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్‌రెడ్డి, కోమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తీగలగుట్టపల్లి
మాజీ సర్పంచ్ మృతి
కరీంనగర్‌రూరల్: తీగలగుట్టపల్లి మాజీ సర్పంచ్ కాశెట్టి రంగమ్మ(85) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి 10గంటలకు మృతిచెందారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో విలీనం కాకముందు 2001 సంవత్సరం నుంచి 2005 వరకు తీగలగుట్టపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా రంగమ్మ పని చేశారు. శనివారం రంగమ్మ మృతదేహానికి పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించారు. రంగమ్మ చిన్న కుమారుడు కాశెట్టి శ్రీనివాస్ రైతుబంధు సమితి కరీంనగర్ మండల కోఆర్డినేటర్ కాగా.. కోడలు లావణ్య రెండో డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు కాశెట్టి లక్ష్మణ్, శ్రీనివాస్‌తో పాటు ముగ్గురు కూతుళ్లున్నారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తుల అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఐఎస్‌ఏ ఫెస్టివల్‌లో
శంకర్ శిల్పం
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామానికి చెంది కరీంనగర్‌లో నివాసముంటున్న సైకత శిల్పి రేవెల్లి శంకర్ ఒడిస్సా రాష్ట్ర టూరిజం శాఖ నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్లో రెండోరోజు శనివారం కోణార్క్ దేవాలయ సమీపంలో గల చంద్రభాగా నదీతీరంలో ఎకో టూరిజం అంశంపై సైకత శిల్పాన్ని రూపొందించి అభినందనలు అందుకున్నారు. అడవి, ఏనుగులు, చెట్లు, ఆహ్లాద వాతావరణంతో కూడిన శిల్పం అందరినీ ఆకట్టుకుంది.
సెయింట్‌జార్జ్‌లో
అల్ఫాబెట్ జంగల్
కొత్తపల్లి: రేకుర్తిలోని సెయింట్ జార్జ్ నినోస్ బ్లాక్(సీబీఎస్‌ఈ)లో శనివారం అల్ఫాబెట్ జంగల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అల్పాబెట్ జంగల్‌లో భాగంగా ఏ టూ జెడ్ వరకు గల జంతువుల వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఇలా చేయడం ద్వారా విద్యార్థులు జంతువుల పేర్లను సులభంగా గుర్తుంచుకునే అవకాశముంటుందని సెయింట్‌జార్జ్, ప్యారడైజ్ విద్యాసంస్థల చైర్మన్ డా.పి.ఫాతిమారెడ్డి తెలిపారు. ఇన్‌చార్జి సంధ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నదీతీరంలో రేవెల్లి శంకర్

పొన్నం ప్రభాకర్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న కాంగ్రెస్ నాయకులు

జంతువుల వేషధారణలో విద్యార్థులు

రంగమ్మ(ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment