
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో లలితాదేవి
కరీంనగర్‌టౌన్: జిల్లాలో క్షయ నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని డీఎంహెచ్‌వో లలి తాదేవి అన్నారు. గురువారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో జాతీయ క్షయ నిర్మూలనపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి, వెంటనే చికిత్స అందించడం ద్వారా నిర్మూలించవచ్చన్నారు. దీర్ఘకాలంగా దగ్గు, స్వల్ప జ్వరం, ఛాతిలో నొప్పి, దగ్గినప్పుడు తెమడ లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకునేలా ఆశలు చొరవ చూపాలని అన్నారు. వైద్యాధికారులు జి.సుజాత, కేవీ.రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.