
మాట్లాడుతున్న శంకర్
కొత్తపల్లి: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26వ తేదీన కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట చేపట్టనున్న ధర్నాకు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని జేఏసీ జిల్లా చైర్మన్ కె.శంకర్ కోరారు. కొత్తపల్లి మండలం చింతకుంటలో గురువారం మాట్లాడారు. సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి 15రోజులు వాయిదా అడిగిన మంత్రి, 40రోజులు దాటినా పట్టించుకోవడం లేదన్నారు. వాయిదా వేసిన సమ్మెను తిరిగి కొనసాగింపులో భాగంగా ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. అందులో భాగంగా అక్టోబర్ 1న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వి.లక్ష్మీనారాయణ, ఎడల్లి సంపత్, సోమిరెడ్డి సత్తిరెడ్డి, కాశిపాక శంకర్, మెరుగు సంపత్, పోచమల్లు, లక్ష్మి, రాజారామ్, రవి, శ్రీధర్, పరశురాం, మహేశ్ పాల్గొన్నారు.