తాడ్వాయి: సంతాయిపే ట్ గ్రామంలోని భీమేశ్వ ర ఆలయ అభివృద్ధికి ప్ర భుత్వం రూ. 1.80 కో ట్లు మంజూరు చేసింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు కృషితో ప్రభుత్వం ఈ నిధుల ను మంజూరు చేసిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రకృతి ఒడిలో ఉన్న భీమేశ్వరాలయానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. పాండవు లు అరణ్యవాస సమయంలో ఇక్కడ సంచరించారని, ఆ సమయంలో భీముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారని స్థల పు రాణం చెబుతోంది. ఇక్కడ శివుడు పంచము ఖుడిగా దర్శనమిస్తాడు. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎ మ్మెల్యే మదన్‌మోహన్‌రావు కృషి చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పలుమార్లు ఆలయం గురించి ప్రస్తావించారు. పలుమార్లు పర్యాటక శాఖ త్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ ఎండీ క్రాంతిలను కలిసి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆయన ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
బాన్సువాడ రూరల్: పట్టణంలోని శ్రీసరస్వతిమాత ఫంక్షన్ హాల్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో జాతీయ హరికృష్ణ ఉత్సవ్ నిర్వహించారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అంశంపై పోటీలు నిర్వహించి, బహుమతులు అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మల్లికార్జున్‌స్వామి, గురువినయ్ స్వామి, నార్ల సురేష్, వెంకన్న గుప్తా, నర్సన్నచారి, విఠల్‌రెడ్డి, పాత బాలకృష్ణ, గుడుకుట్ల శ్రీనివాస్, తాడ్కోల్ శ్రీనివాస్‌రెడ్డి, ఇస్కాన్ ప్రతినిధులు వెంకటదాస్, సిద్ద బలరాం పాల్గొన్నారు.
మద్నూర్: వచ్చే విద్యా సంవత్సరానికి ఇంటర్ విద్యార్థుల కోసం అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇంటర్ నోడల్ అధికారి సలాం ఆదేశించారు. మండల కేంద్రంలోని బాలుర గురుకుల ఇంటర్ కళాశాలను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ప్రయోగశాలలను, కళాశాలలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధాకర్, వైస్ ప్రిన్సిపల్ వెంకట్, అధ్యాపకులు సంతోష్, దత్తాత్రే, మనోహర్, శివాజీ, ఉమాకాంత్ ఉన్నారు.
బీబీపేట: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఏ142 జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగిన సమావేశాల్లో ఈ ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా బానోత్ దేవీసింగ్, ఉపాధ్యక్షుడిగా బండ్ల స్వామి, కార్యదర్శిగా అందె దేవరాజు, అదనపు కార్యదర్శిగా సాళ్ల కిష్టయ్య ఎన్నికై నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.
కామారెడ్డి క్రైం: చట్ట విరుద్ధమైన బెల్ట్ షాప్‌ల నిర్వహణను ఎకై ్సజ్ శాఖ చూసీచూడనట్లు వ్య వహరిస్తుండడంతో మద్యం అక్రమ దందా ఇ ష్టారాజ్యంగా సాగుతోంది. అన్ని గ్రామాల్లో బె ల్ట్ షాప్‌ల నిర్వహణ సర్వసాధారణంగా మారిపోయింది. ఏడాది కాలానికి గాను గ్రామాల్లో వాటికి వేలం వేస్తుంటారు. అయితే కామారెడ్డి మండలం రాఘవపూర్ గ్రామంలో ఏకంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే బెల్ట్ షాప్ వేలం నిర్వహించారన్న ప్రచారం జోరుగా సా గుతోంది. ఈ వార్త ఆదివారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ విషయమై గ్రా మస్తులను సంప్రదించగా గ్రామంలో మద్య ని షేధంపై నిర్ణయం తీసుకోవడం కోసం పాఠశా ల ఆవరణలో సమావేశమయ్యామన్నారు. పా ఠశాల ఆవరణలో బెల్ట్ షాప్ వేలం ప్రచారంపై అటు ఎకై ్సజ్ శాఖ, ఇటు విద్యాశాఖ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.


