నిజామాబాద్‌ జిల్లాలో.. | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌ జిల్లాలో..

Apr 6 2026 7:48 AM | Updated on Apr 6 2026 7:48 AM

నిజామాబాద్‌ జిల్లాలో..

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): నిజామాబాద్‌ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన రాళ్ల వాన బీభత్సం సృష్టించింది. సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్‌పల్లి, సాలూర మండలాల్లో అధికంగా పంటలకు నష్టం వాటిల్లగా.. జిల్లాలోని 22 గ్రామాల్లో 6,088 ఎకరాల విస్తీర్ణంలో రైతులు పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించింది. 3,985 మంది రైతులు తమ పంటలను నష్టపోయినట్లుగా అధికారులు గుర్తించారు. అత్యధికంగా 5,065 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. మొక్కజొన్న 826 ఎకరాలలో, మామిడి 138, అరటి, కూరగాయలు 10 ఎకరాల్లో నష్టపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement