● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● మాజీ ఉపప్రధానికి ఘన నివాళులు
కామారెడ్డి టౌన్ : మాజీ ఉప ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు బాబూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన నిరంతరం కృషి చేశారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీవో గిరి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి వెంకటేశ్వర్లు, వివిధ సంఘాల నాయకులు మల్లన్న, ప్రేమ్‌కుమార్, గంగారాం, బాబు, రాజనర్సు, సిద్దిరాములు, నరేందర్, వెంకటరాములు, బాలరాజు, శివరాములు, బలరాం, బాలమణి, గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


