బాలిక దినోత్సవంలో మాలవత్ పూర్ణ
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి బాలికల గురుకుల పాఠశాలలో శనివారం జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఎవరెస్టు శివఖరాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.బాలికల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన పోటీలను నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ప్రిన్సిపల్ సురేఖ, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బాలికలు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
పెద్దకొడప్‌గల్(జుక్కల్): బాలికలు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎంఈవో ప్రవీణ్ కుమార్ తెలిపారు.శనివారం కాటేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికల దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయు బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): విద్యతోనే సమగ్ర అభివృద్ధి సాధించవచ్చని ఎస్‌ఐ స్రవంతి అన్నారు. తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడిలో గల ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. లింగభేదం లేకుండా విద్యను అభ్యసించినట్లయితే సమాజంలో మంచి అభివృద్ధి సాధిస్తామని తెలిపారు. ఎంఈవో రామస్వామి, ఇన్‌చార్జి హెచ్‌ఎం శ్వేత, ఉపాధ్యాయులు హేమంత్‌కుమార్, గిరిధర్, రమేష్, బాబురావు, శ్రీహరి, రాజు, సుజాత, విద్యార్థులు పాల్గొన్నారు.
బాలిక దినోత్సవంలో మాలవత్ పూర్ణ


