పదోన్నతులు బాధ్యతను పెంచుతాయి
కామారెడ్డి క్రైం: పదోన్నతులు బాధ్యతను పెంచుతాయని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఏఎస్సై గా పదోన్నతి పొందిన దేవరాజు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ స్వయంగా ఏఎస్సైకి పదోన్నతి చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.
శాంతియుత
వాతావరణంలో రంజాన్
కామారెడ్డి క్రైం: శాంతియుత వాతావరణంలో రంజాన్‌ను జరుపుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. రంజాన్ ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులు, ముస్లిం పెద్దలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. రంజాన్ ఏర్పాట్లకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. శాంతి కమిటీలు ఏర్పాటు చేసి మసీదులు, ఈద్గాల వద్ద తగిన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. మసీదుల వద్ద విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం సౌకర్యాలను మెరుగుపరచాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. అదనపు కలెక్టర్ మధు మోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవో వీణ పాల్గొన్నారు.
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ అమలుపై సమావేశం
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ – 2010 అమలుపై శనివారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే జరిమానాలు విధించి నోటీసులు జారీ చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ విద్యకు సూచించారు. రిజిస్టర్ చేసుకోని ఆస్పత్రుల వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మాజీ సర్పంచ్ మృతి
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం సింగితం గ్రామ మాజీ సర్పంచ్ ర్యాల లావణ్య రెడ్డి శనివారం మృతి చెందారు. నెల రోజుల కిందట అనారోగ్యానికి గురయ్యారు. ఈవిషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌సింథే, మాజీ జెడ్పీచైర్మన్ దఫేదార్ రాజుతో పాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
బిచ్కుంద(జుక్కల్): పంట పొలాల్లో విద్యుత్ మోటర్ల కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లను దొంగలు ధ్వంసం చేసి రాగి వైరు. ఆయిల్ ఎత్తుకెళ్తున్నారని, కొత్త వ్యక్తులు సంచరిస్తే పొలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై రాజు అన్నారు. ఈవిషయమై రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 8712686176 ఫోన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. పొలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
పదోన్నతులు బాధ్యతను పెంచుతాయి


