పరదాలతో పోలింగ్ బూత్‌లు
● ప్రశాంతంగా ముగిసిన
పంచాయతీ ఎన్నికలు
● పోలింగ్ తీరును
పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మూడో విడతలో ఎనిమిది మండలాల పరిధిలో 168 పంచాయతీలు, 1,482 వార్డులు ఉండగా.. 26 సర్పంచ్, 449 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 142 గ్రామాల సర్పంచ్ పదవులు, 1,020 వార్డులకు బుధవారం ఎన్నికలు జరిగాయి. 85.95 శాతం ఓటేశారు.
బాన్సువాడలో 25 పంచాయతీలకుగాను పది పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 15 పంచాయతీల్లో సర్పంచ్‌లుగా 68 మంది పోటీ పడ్డారు. బిచ్కుంద మండలంలో 23 పంచాయతీలకుగాను ఒకటి ఏకగ్రీవమవగా.. 22 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 67 మంది, బీర్కూర్‌లో 13 పంచాయతీలుండగా ఒకటి ఏకగ్రీవం కాగా.. మిగిలిన 12 పంచాయతీల్లో 37 మంది సర్పంచ్ పదవికి పోటీ పడ్డారు. డోంగ్లీ మండలంలో 13 పంచాయతీలకుగాను ఒకటి ఏకగ్రీవమైంది. 12 గ్రామాల సర్పంచ్ పదవులకు 40 మంది పోటీ పడ్డారు. జుక్కల్‌లో 30 పంచాయతీలుండగా ఐదుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవంగా కాగా.. 25 గ్రామాల్లో సర్పంచ్ పదవులకు 77 మంది బరిలో నిలిచారు. మద్నూర్‌లో 21 పంచాయతీలకుగాను ఒకటి ఏకగ్రీవంకాగా.. 20 పంచాయతీలకు 69 మంది, నస్రుల్లాబాద్‌లో 19 పంచాయతీలకు గాను మూడు ఏకగ్రీవమవగా.. 16 పంచాయతీల్లో 55 మంది పోటీ చేశారు. పెద్దకొడప్‌గల్‌లో 24 పంచాయతీల్లో నాలుగు ఏకగ్రీవమవగా, 20 చోట్ల 49 మంది పోటీ పడ్డారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఆయా మండలాల్లో పోలింగ్ కేంద్రాలను, కౌంటింగ్ ప్రక్రియను కలెక్టర్‌తోపాటు ఎస్పీ రాజేశ్ చంద్ర, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఏఎస్పీ చైతన్య తదితరులు పరిశీలించారు.
నస్రుల్లాబాద్: ఫకీరా నాయక్ తండాలో గదులు సరిపోకపోవడంతో పరదాలు కట్టి పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఇక్కడ రెండు గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో పరదాలు కట్టి పోలింగ్ బూత్‌లుగా వినియోగించుకున్నారు.
లింగంపల్లి తండాలో ఆరు పోలింగ్ కేంద్రాలు ఉండగా.. గదులు సరిపోక హాల్‌లో రెండింటిని పరదాల మధ్య ఏర్పాటు చేశారు.
పరదాలతో పోలింగ్ బూత్‌లు
పరదాలతో పోలింగ్ బూత్‌లు
పరదాలతో పోలింగ్ బూత్‌లు
పరదాలతో పోలింగ్ బూత్‌లు
పరదాలతో పోలింగ్ బూత్‌లు


