‘బాలల హక్కులను పరిరక్షించాలి’
నాగిరెడ్డిపేట: బాలల హక్కులను పరిరక్షించాలని జిల్లా న్యాయమూర్తి నాగరాణి సూచించారు. నాగిరెడ్డిపేటలోని మోడల్ స్కూల్‌లో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు తమ ఫిర్యాదులను, సమస్యలను సంబంధిత అధికారులకు నివేదించాలన్నారు. బాల్యవివాహం చట్టప్రకారం నేరమవుతుందని పేర్కొన్నారు. అనంతరం ఇంటర్ విద్యార్థులకు బాలల హక్కులు, వేధింపులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సభ్యులు వీణ, మోహన్, దత్తు, పాఠశాల ప్రిన్సిపాల్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మాచారెడ్డి: పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామ శివారులోని ఒడ్డెగూడం సమీపంలో ఓ దూడపై పెద్దపులి దాడి చేసి చంపింది. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు కామటి చిన్న రాజయ్య దూడను పంట చేను వద్ద కట్టేసి ఉంచారని, తెల్లవారుజామున పెద్దపులి దాడిచేసి చంపేసిందని మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రమేశ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులు, గొర్రెలను అటవీ ప్రాంతానికి తీసుకు వెళ్లవద్దని సూచించారు.
ఆర్మూర్‌టౌన్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా హాకీ జట్టును పట్టణంలోని మినీస్టేడియంలో బుధవారం ఎంపిక చేసినట్లు హాకీ అసోసియే షన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమ ణ తెలిపారు. ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–19 విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఎంపి క చేశామన్నారు. ఈనెల 20న రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి అంతర్ కళాశాలల పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ చిన్నయ్య, అంజు, హాకీ క్రీడాకారులు శ్రీను, వెంకేటేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘బాలల హక్కులను పరిరక్షించాలి’


