జంగంపల్లిలో భారీ మెజారిటీ
వెబ్ క్యాస్టింగ్ ద్వారా పరిశీలన
● 1,561 ఓట్ల తేడాతో గెలుపు
భిక్కనూరు: జంగంపల్లి సర్పంచ్‌గా దేవరబోయిన శ్రీ వాణి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ బీఆర్‌ఎస్ మద్దతుతో బరిలో దిగిన శ్రీవాణికి 2,162 ఓట్లు రాగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మానసకు 601 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో శ్రీవాణి 1,561 ఓట్ల తేడాతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గ్రామంలో ఇప్పటివరకు ఎవరూ ఇంత భారీ మెజారిటీతో గెలవలేదని గ్రామస్తులు తెలిపారు.
భార్య సర్పంచ్, భర్త వార్డు సభ్యుడు..
జంగంపల్లి సర్పంచ్‌గా ఎన్నికై న శ్రీవాణి భర్త వాసుయాదవ్ ఏడో నంబర్ వార్డు నుంచి పోటీ చేశారు. ప్రత్యర్థి నరేశ్ మూర్తిపై 95 ఓట్లతో గెలుపొందారు.
భార్యాభర్తలపై భార్యాభర్తల గెలుపు..
జంగంపల్లి సర్పంచ్ అభ్యర్థులుగా శ్రీవాణి, మానస పోటీపడగా.. శ్రీవాణి భర్త వాసుయాదవ్, మానస భ ర్త నరేశ్ మూర్తి ఏడోవార్డులో ప్రత్యర్థులుగా నిలిచారు. ఎన్నికలలో శ్రీవాణి వాసుయాదవ్ దంపతులు మా నస నరేశ్‌మూర్తి దంపతులపై పైచేయి సాధించారు.
కామారెడ్డి క్రైం: కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. కార్యక్రమంలో డీపీవో మురళి, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కౌంటింగ్ కేంద్రం..
దోమకొండ: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ దోమకొండ ప్రభుత్వ బాలికల పాఠశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. సిబ్బందికి సూచనలి చ్చారు. పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు, ఎన్‌సీసీ సిబ్బంది, ఆశవర్కర్‌లతో మాట్లాడారు. ఆయన వెంట జిల్లా పరిషత్ సీఈవో చందర్, ఆర్డీవో వీణ, మండల ప్రత్యేకాధికారి జ్యోతి, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, తహసీల్దార్ సుధాకర్ తదితరులున్నారు.
జంగంపల్లిలో భారీ మెజారిటీ


