క్రైం కార్నర్
పర్మిట్ రూంలో ఒకరి మృతి
నిజాంసాగర్(జుక్కల్): మండల కేంద్రంలోని భ్రమరాబ వైన్స్‌షాపు ఆవరణలోని పర్మిట్ రూంలో మద్యం సేవించిన మంగళి సాయిలు(40) అనే వ్యక్తి బుధవారం రాత్రి మెట్ల కిందపడి చనిపోయినట్లు స్థానిక ఎస్సై శివకుమార్ తెలిపారు. ఒడ్డేపల్లి గ్రామానికి చెందిన సాయిలు స్థానిక వైన్స్‌షాపులో మద్యం కొనుగోలు చేసి వైన్స్ వెనుకభాగంలో ఉన్న పర్మిట్ రూంలో సేవించాడు. మెట్లపై కూర్చున్న సాయిలు ఆకస్మికంగా కిందపడటంతో తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి అన్న ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
క్రైం కార్నర్


