రేపు నవోదయ ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

రేపు నవోదయ ప్రవేశ పరీక్ష

Dec 12 2025 6:43 AM | Updated on Dec 12 2025 6:43 AM

రేపు

రేపు నవోదయ ప్రవేశ పరీక్ష

రేపు నవోదయ ప్రవేశ పరీక్ష 27 వరకు దూరవిద్య ఫీజుకు గడువు బోధన్‌ డివిజన్‌లో డీసీసీ అధ్యక్షుడి పర్యటన ఎఫ్‌పీవోలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకం

ఖలీల్‌వాడి: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి ఈ నెల 13న పరీక్షను నిర్వహించనున్నటలు డీఈవో అశోక్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 5,124 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వారు 2,240 మంది, కామారెడ్డి జిల్లాకు చెందిన 2,884 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 11 గంటల లోపు చేరుకోవాలని, ఆ తర్వాత లోనికి అనుమతించబోమని తెలిపారు. ఉదయం 11.30 నుంచి 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు హాల్‌ టికెట్‌తోపాటుగా ఆధార్‌, రేషన్‌కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలని సూచించారు. సందేహాలుంటే నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ లేదా ఇంచార్జీ ప్రభాకర్‌ 97019 07749 నెంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

ఖలీల్‌వాడి: అంబేడ్కర్‌ దూర విద్య పరీక్ష ఫీజు ఈ నెల 27 వరకు చెల్లించాలని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాంమోహన్‌ రెడ్డి, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రంజిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్‌, బీఎస్సీ ఒకటి, మూడు, ఐదో సెమిస్టర్ల ఫీజును చెల్లించాలని పేర్కొన్నారు. బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్‌ విద్యార్థులు థియరీ పరీక్ష ఫీజుతోపాటు ప్రాక్టికల్స్‌ కోసం కూడా ఫీజు చెల్లించాలని సూచించారు. వివరాలకు 7382929612 నెంబర్‌లో సంప్రదించాలని తెలిపారు. ఎంబీఏ, బీఎల్‌ఐఎస్‌ఏ సెమిస్టర్‌– 2 విద్యార్థులు ఈ నెల 27లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు.

పోలింగ్‌ కేంద్రాలను సందర్శించిన నాగేశ్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: బోధన్‌ డివిజన్‌లోని వివిధ మండలాల్లో గురువారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేశ్‌ రెడ్డి పర్యటించారు. రెంజల్‌, ఎడపల్లి మండలా ల్లోని వివిధ పోలింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించారు. నాగేశ్‌రెడ్డితోపాటు జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ జె డ్పీటీసీ నాగభూషణ్‌రెడ్డి, పులి శ్రీనివాస్‌, యు వజన నాయకుడు వేణురాజ్‌, కౌశిక్‌, ఆయా మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు పాల్గొన్నారు.

సుభాష్‌నగర్‌: రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై పరికరాలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని జేఎంకేపీఎం రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు పాట్కూరి తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మహానందిలో అరటి, పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘాన్ని రైతులతోపాటు తిరుపతిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు పండించిన పంటలు మార్కెటింగ్‌ అంశాలు, దిగుబడులు, పెట్టుబడి, ఆదాయ వ్యయాలపై తిరుపతిరెడ్డి వివరించారు. అనంతరం తిరుపతిరెడ్డిని ఎఫ్‌పీవో ప్రతినిధులు సన్మానించారు.

రేపు నవోదయ ప్రవేశ పరీక్ష 1
1/1

రేపు నవోదయ ప్రవేశ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement