సమర్థత కలిగిన నేతను ఎన్నుకోండి
● ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్
పిట్లం(జుక్కల్): పిట్లం భవిష్యత్తు పిట్లం గ్రామస్తుల చేతుల్లోనే ఉందని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి సమర్థత కలిగిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్ధి కుమ్మరి శేఖర్‌ను గెలిపించాలని, ప్రతిపక్షాలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిస్తే గ్రామాలు అభివృద్ధికి దూరమవుతాయని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్ పేర్కొన్నారు. ఆయన గురువారం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పిట్లం మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్ధి కుమ్మరి శేఖర్, నాయకులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి కావాలంటే అధికార పార్టీనే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శేఖర్‌కు తన పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు.
ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా
నిజాంసాగర్(జుక్కల్): ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే, గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని మహమ్మద్‌నగర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థి అందోల్ అశ్విని అన్నారు. గురువారం మహమ్మద్‌నగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థి అశ్విని ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పదేళ్లు అధికారంలో ఉన్న సర్పంచ్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. నాయకులు మల్లయ్యగారి శివరాజ్, ఆకాష్, చింతకింది కాశయ్య, ఇఫ్తేకర్ దొర, తోట రాజు, సంగమేశ్వర్ తదితరులున్నారు.
సమర్థత కలిగిన నేతను ఎన్నుకోండి


