నూతన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం
కామారెడ్డి రూరల్: ఇస్రోజీవాడిలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా చెట్కూరి మల్లయ్య నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసుకున్న దంపతులకు ఆయన నూతన వస్త్రాలను అందజేశారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుదర్శన్‌రావు, మండల ఉపాధ్యక్షుడు కుమార్‌గౌడ్, చింతల రవితేజగౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ శంకర్‌గౌడ్, గంగయ్య, జగదీశ్వర్, చెట్కూరి రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.


