వడ్లను ఆరబెట్టే మిషన్ ప్రారంభం
రామారెడ్డి: అన్నారంలో వడ్ల కొనుగోలు కేంద్రం –వడ్లు ఆరబెట్టే మిషన్‌ను మాచారెడ్డి సొసైటీ చైర్మన్ స్వామి గౌడ్, మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులు వడ్లను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని, దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించి సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ కూడ ఇస్తోందని చెప్పారు. సొసైటీ సీఈవో చంద్రారెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు మద్దికుంట దయానంద్, గడ్డం గంగారెడ్డి, సల్మాన్, కీసరి లక్ష్మణ్, శ్రీకాంత్, దేవదాసు, చంద్రం, మండ్ల బాలనర్సు, రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు.
వంద శాతం అక్షరాస్యత సాధించాలి
భిక్కనూరు: వచ్చే ఏడాది మార్చి 8న మహిళా దినోత్సవం వరకు వంద శాతం అక్ష్యరాస్యత సాధించాలని జిల్లా ఏపీవో వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ఆయన భిక్కనూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన వయోజన విద్య కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 55 మహిళ గ్రామ సంఘాల నుంచి గ్రామ సంఘానికి ఇద్దరూ సభ్యులను ఒక్క వీవోఏలతో రెండు రోజులు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని, ప్రతి ఒక్కరూ వందశాతం అక్షరాస్యత కోసం పాటుపడాలని ఆయన కోరారు. ఎంపీడీవో రాజ్‌కిరణ్ రెడ్డి, ఎంఈవో రాజ్‌గంగారెడ్డి, సీఆర్‌పీలు సంగీత, దుర్గ, ఏపీఎం సాయిలు పాల్గొన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో బీఎఫ్‌టీ భార్గవ్ మృతి పట్ల ఉపాధిహామీ సిబ్బంది సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా సాంకేతిక సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో బీఎఫ్‌టీగా పనిచేస్తున్న భార్గవ్ అధికారుల వేధింపులకు గుండెపోటుతో మరణించిన విషయం రాష్ట్ర మంతా తెలిసిందన్నారు. ఆయన మృతిచెందడం బాధాకరమన్నారు. ఈసంధర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
వడ్లను ఆరబెట్టే మిషన్ ప్రారంభం


