కానిస్టేబుల్‌కు ఎస్పీ అభినందనలు
కామారెడ్డి రూరల్: నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన పరీక్షలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్–1గా ఎంపికై న నేనావత్ కస్తూరిని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. కస్తూరి ఎక్లారా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో పదో తరగతి వరకు విధ్యనభ్యసించి, అనంతరం వరంగల్‌లో ఇంటర్, కోటీ ఉమెన్స్ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 2024లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా ఎంపికై నిజాంసాగర్ పీఎస్‌లో విధులు చేపట్టారు. విధుల్లో నిబద్ధతతో పాటు నిరంతర అభ్యాసాన్ని కొనసాగిస్తూ, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 2025లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్–1( ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్)లో ఉద్యోగాన్ని సాధించడం విశేషం. కస్తూరిని ఎస్పీ అభినందించి మెమెంటోతో సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ..భవిష్యత్తులో కూడా తన ప్రతిభతో మంచి పేరు సంపాదించి, ప్రజలకు సేవ చేస్తూ, తనదైన ముద్రను వేసుకోవాలని ఆకాంక్షించారు.


